prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:11 am Digital Edition : RAJASHEKARREDDY

గాగిల్లాపూర్‌లో పోచమ్మ తల్లి పునర్ ప్రతిష్టకు ఘన ఏర్పాట్లు పూర్తి

బెజ్జంకి ,ఏప్రిల్ 18( ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమానికి ఘన ఏర్పాట్లు పూర్తయ్యాయి.నేటి నుండి సోమవారం వరకు జరిగే ఈ వేడుకల సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు.హోమ కార్యక్రమం, నవగ్రహాల పూజలతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పునర్ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ జానకి-రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ,వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు కోరారు.