గాగిల్లాపూర్‌లో ఘనంగా వార సంత ప్రారంభం.. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సర్పంచ్ ఎర్రల జానకి -రాజు శ్రీకారం

  బెజ్జంకి,జూలై 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార సంతను గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఒకేచోట సరసమైన ధరలకు అందించడంతో పాటు స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ వార సంతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని...