prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 6:47 pm Digital Edition : RAJASHEKARREDDY

గాగిల్లాపూర్‌లో ఘనంగా వార సంత ప్రారంభం.. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సర్పంచ్ ఎర్రల జానకి -రాజు శ్రీకారం

 

బెజ్జంకి,జూలై 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార సంతను గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఒకేచోట సరసమైన ధరలకు అందించడంతో పాటు స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ వార సంతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వార సంత గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, వ్యాపారులు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు విక్రయిస్తూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, చింతలపల్లి లత-కొండల్ రెడ్డి, సొల్లు బాలయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ మాచం శ్రీనివాస్, కాచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.