గాగిల్లాపూర్‌లో ఘనంగా “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పనులు – విద్యార్థులకు అవగాహన
బెజ్జంకి,జూలై 14 (ప్రజావాణి) గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. దోమలు, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. అలాగే...