prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 10:09 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గాంధీ సెంటర్లో విగ్రహాలు కట్టించారు సరే..! మెట్లు మరిచారు..

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)నందిగామ జాతీయ నాయకుల వేడుకలు చేసుకోవాలంటే నిచ్చెన అద్దెకి తెచ్చుకోవాల్సిందే.నందిగామ గాంధీ సెంటర్లో జాతీయ నాయకుల విగ్రహాలు దేశ స్ఫూర్తిని, ఐక్యతను చాటుతాయి కానీ ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే జయంతి మరియు వర్ధంతి వేడుకలు వచ్చినప్పుడు నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేయాలంటే కార్యక్రమం నిర్వహించేవారు నిచ్చెన అద్దెకు తెచ్చుకోవాల్సిందే.. నిచ్చెన ఎందుకంటే జాతీయ నాయకుల విగ్రహాలకు పూలదండలు వేయాలంటే మెట్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతూన్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఈరోజు పూలె విగ్రహానికి పూలమాలు వేయడానికి మహిళలు నిచ్చెన ద్వారా వెళ్లాలంటే ఇబ్బంది కరం కలిగించింది. యువకులు అంటే నిచ్చెన ఎక్కే అవకాశం ఉంది. కొద్దిగా వయసు మీద పడినా పెద్దవారు నిచ్చెన ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు.ఇకనైనా మున్సిపల్ ( సంబంధిత)అధికారులు తక్షణమే శాశ్విత మెట్లు కట్టించవలసిందిగా కోరుతున్నారు.శాశ్వత మెట్లు కట్టించే అవకాశం లేనిచో తాత్కాలిక ఇనుప గ్రిల్స్ మెట్లు కట్టవలసినదిగా ప్రజలు కోరుతున్నారు.