గర్భిణీ స్త్రీకి రూ. 30 వేల ఆర్థిక సాయం మానవత్వానికి మారుపేరు సీఐ విజయలక్ష్మి:

కడపప్రజావాణిన్యూస్(మార్చి27)బ్రహ్మంగారిమఠం:నేటి యాంత్రిక జీవనంలో తోటి మనిషి కష్టాన్ని చూసి స్పందించే గుణం మృగ్యమైపోతున్న తరుణంలో,నేనున్నానంటూ ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు సీఐ విజయలక్ష్మి గారు.పోలీసు యూనిఫాంలో ఉన్నా,తన గుండె నిండా నిండిన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.కర్నూలు జిల్లా మహిళా విభాగం సి.ఐ.శ్రీ విజయలక్ష్మి గారు. బ్రహ్మంగారిమఠం మండలంలోని నరసన్నపల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె జగన్ సతీమణి శ్రీమతి రేణుక ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణీ.ప్రసవ సమయం ఆసన్నమవుతున్న వేళ,ఆ కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న విజయలక్ష్మి గారు తక్షణమే స్పందించారు.డెలివరీ...