గర్భిణీలకు అందని స్కానింగ్ సేవలు
*గర్భిణీలకు అందని "స్కానింగ్" సేవలు**మాతా శిశు ఆసుపత్రిలో నిరుపయోగంగా లక్షల రూపాయల స్కానింగ్ యంత్రాలు**రేడియాలజిస్టు లేక గర్భిణీలకు తీవ్ర ఇబ్బందులు**ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలతో పేదలపై ఆర్థిక భారం* *మన ప్రజావాణి* మంచిర్యాల జులై 17 జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.స్వయానా వైద్యులైన రాష్ట్ర మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల...