గరుడాద్రి క్షేత్రంలో జూలై 19న శ్రీ గోదాదేవికి లక్ష గాజుల మహోత్సవం…. గాజులమ్మగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఆండాళమ్మ తల్లి
ఘట్‌కేసర్, జూలై 16: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్‌లోని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదాదేవి (ఆండాళమ్మ) తల్లికి జూలై 19న (ఆదివారం) లక్ష గాజుల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ విశిష్ట ఉత్సవంలో భాగంగా, భక్తుల ఆరాధన పొందుతున్న ఆండాళమ్మ తల్లికి లక్ష గాజులను సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో "గాజులమ్మ"గా అమ్మవారు భక్తులకు దర్శనం...