గరిష్ట ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు
మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరిక జైపూర్,జూలై22,ప్రజావాణి: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులను కొనుగోలు చేయవద్దని జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీమతి ఇ. సురేఖ సూచించారు. బుధవారం జైపూర్ మండలంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలపై సహాయ వ్యవసాయ సంచాలకులు బి. ప్రసాద్, మండల వ్యవసాయ అధికారిణి సయ్యద్ ఖుదసియా గుల్రెజలతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని నిల్వలు, రికార్డులు, ధరల బోర్డులను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సురేఖ...