గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దారుణ పరిస్థితి– రోగులు ఆగ్రహం..
సిద్దిపేట్, ఏప్రిల్ 27, ప్రజావాణి గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగానిర్లక్ష్యానికిగురయ్యాయని రోగులు,వాళ్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ అసిస్టెంట్లు తమ విధులను పక్కన పెట్టి గుంపులు గుంపులుగా నిలబడి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగుల వేదన ప్రకారం, ఆసుపత్రికి వచ్చే వాళ్ల కి సమయానికి పరీక్షలు చేయకపోవడం, చికిత్సను నిర్లక్ష్యంగా ఆలస్యం చేయడం సాధారణంగా మారిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సిబ్బంది స్పందన లేకపోవడం వల్ల ప్రాణాపాయ...