గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్
అన్నమయ్య జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రూ.1 లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదనపు ఎస్పీ వెంకటాద్రి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.గతంలో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో పరారీలో ఉన్న నిందితులను శనివారం బసినికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా పారిపోతుండగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు...