గంజాయి కోరల్లో చిక్కుకుంటున్న యువతరం.

గంజాయి కోరల్లో చిక్కుకుంటున్న యువతరం.ఇటీవల కాలంలో వెలువడిన కథనాలపై స్పష్టత కరువు !ప్రజలు బహిర్గతంగా మాట్లాడలేకపోవడమే ఈ సమస్యకు అద్దం పడుతుందా !ఏదేమైనా సమస్యను ప్రజల ముందుంచి శాశ్వత పరిష్కారం చూపించాల్సింది అధికారులే.కోటగిరి/ప్రజావాణి:-మహారాష్ట్ర రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఉమ్మడి కోటగిరి మండలం క్రమంగా గంజాయి మత్తులో చిక్కుకుంటోందా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.ఇటీవల కాలంలో కోటగిరిలో గంజాయి క్రయ,విక్రయాలపై పలు వార్తాకథనాలు వెలువడినా వాటిపై స్పష్టత రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.జరుగుతున్న దుష్పరిణామాలపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తల్లిదండ్రులు కూడా తమ...