గంజాయి కోరల్లో చిక్కుకుంటున్న యువతరం.
ఇటీవల కాలంలో వెలువడిన కథనాలపై స్పష్టత కరువు !
ప్రజలు బహిర్గతంగా మాట్లాడలేకపోవడమే ఈ సమస్యకు అద్దం పడుతుందా !
ఏదేమైనా సమస్యను ప్రజల ముందుంచి శాశ్వత పరిష్కారం చూపించాల్సింది అధికారులే.
కోటగిరి/ప్రజావాణి:-మహారాష్ట్ర రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఉమ్మడి కోటగిరి మండలం క్రమంగా గంజాయి మత్తులో చిక్కుకుంటోందా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.ఇటీవల కాలంలో కోటగిరిలో గంజాయి క్రయ,విక్రయాలపై పలు వార్తాకథనాలు వెలువడినా వాటిపై స్పష్టత రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.జరుగుతున్న దుష్పరిణామాలపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వ్యవహారాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని చర్చ జరుగుతోంది.మొత్తంగా చూస్తే జరుగుతున్న దుష్పరిణామా లపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నతాధికారులు సీరియస్:
ఈ విషయంపై నిజామాబాద్ సీపీ సీరియస్ గా ఉన్నట్లు వెల్లడవుతోంది.ఇటీవల కాలంలో కోటగిరి పోలీస్టేషన్ తనికి చేసిన సందర్భంలో భాగంగా ఆయన గంజాయి విషయమై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
తాజా ఆరోపణలు:
ఇటీవల ఒక బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి స్థానికంగా గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవ హారంలో స్థానికంగా ఓ వ్యాపార సంస్థలో పనిచేసే వ్యక్తి ప్రమేయం ఉందనే పుకార్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ రాలేదు.
ఎవరు పట్టుకున్నారు:
ఈ ఘటనను స్థానిక పోలీసులే గుర్తించారా? లేక ఏదైనా స్పెషల్ టీమ్ దాడులు చేసి పట్టుకున్నారా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
గోప్యత ఎందుకు:
సంఘటనకు సంబంధించిన వాస్తవ వివరాలు బయటకు రాకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఈ గోప్యత దర్యా ప్తు నిమిత్త మా? లేక పెద్ద ముఠాను పట్టుకోవాల్సి ఉండటమా? అనేది తెలియడం లేదు.
ప్రజల డిమాండ్:
గంజాయి వంటి మత్తు పదార్థాలు యువతను తప్పుదారి పట్టిస్తోందని.ఇలాంటి అక్రమాలపై పోలీసు,ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.