prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 4:52 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ కి ఆర్థిక సాయం

ప్రజవాని :గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటనపై బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కే రితేష్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. నేడు కాశి నాయన మండలం గంగనపల్లి లో బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.పుట్టెడు దుఃఖంలో ఉన్న దిలీప్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, తన వంతుగా తక్షణ ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.పెట్రోల్ పోసి దహనం చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.నిందితులకు చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు బిజివేముల కుటుంబం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మన కూటమి ప్రభుత్వం దళితుల రక్షణకు కట్టుబడి ఉందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు త్వరగా అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రితేష్ రెడ్డి గారితో పాటు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గారు,బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రామ సుబ్బారెడ్డి గారు,రాజారెడ్డి గారు ,టీడీపీ కార్యకర్తలు పాల్గొని బాధితులకు తమ సంఘీభావం ప్రకటించారు.