prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 4:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఖాజీపేట అగ్రహారం అమ్మాయి నాగ కీర్తన సంఘటన గురించి పోలీసు యంత్రాంగాన్ని విమర్శించిన. వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. కాకాని పూజిత..

కడప జిల్లప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)కాజీపేట అగ్రహారం విద్యార్థి కీర్తన హత్య కేసులో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేసారని వైసిపి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు చేసిన ఆరోపణలపై స్పందించిన కడప జిల్లా పోలీసు యంత్రాంగం.ఖాజీపేట అగ్రహారం అమ్మాయి నాగ కీర్తన సంఘటన గురించి పోలీసు యంత్రాంగాన్ని విమర్శించిన వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన కడప జిల్లా పోలీసులు.ఈ ఘటన లో పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కీర్తనను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది.బాధితుల వెంట రిమ్స్ హాస్పిటల్ కు ఎస్ఐ, పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.నిందితుడు వెంకటేష్ గురించి సమాచారం తెలిసిన వెంటనే నిందితుని అదుపులోకి తీసుకొని మైదుకూరు స్టేషన్కు తరలించడం జరిగింది.అనంతరం పోలీసులు విచారణలో ఉండగా మృతురాలు కీర్తన బంధువులు నేషనల్ హైవే పై దాదాపు మూడున్నర గంటల పాటు ధర్నా చేసినా కూడా సంయమనంతో జిల్లా పోలీసు జిల్లా బృందం బంధువులకు, ప్రజలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించడం జరిగింది.వారిపై ఎటువంటి లాటి చార్జ్ చేయలేదు .అటువంటి ఆరోపణలను పోలీసు యంత్రాంగం తప్పుభట్టింది అవాస్తవాలను ప్రజలకు తెలియజేయడం సరైంది కాదని తెలిపారు.నిందితుని విచారణ నిమిత్తం వేరే ప్రాంతానికి తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయి పోలీసులు టీం గా ఏర్పడి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.నిందితుడు పోలీసులపై తిరగబడి కత్తితో గాయపరచడంతో కాల్పులు జరపడం జరిగింది.సాహసంతో పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఈ ఘటనలో పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందారు.స్వయంగా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గారు సంఘటన జరిగిన రోజు సాయంత్రమే తల్లిదండ్రులను పిలిపించుకుని వారికి చట్టపరంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని కీర్తన తల్లితండ్రులకు తెలిపారు.మరుసటి దినం కడప జిల్లా ఎస్ పి నచికేత్ విశ్వనాథ్ గారు పోలీసులను పరామర్శించి అనంతరం రిమ్స్ మార్చురీ వద్దకు వెళ్లి కీర్తన తల్లిదండ్రులకు,బంధువులకు నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరంగా నిందితునికి శిక్ష పడే వరకు పోలీసులు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.నిన్నటి దినం కీర్తన బంధువులు కొన్ని గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నప్పటికీ సంయమనం పాటించి నచ్చజెప్పి కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నిందితునికి శిక్షపడేలా అన్ని రకాల సహకారాలు అందిస్తామని పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది.అనంతరం ధర్నాను విరమించేలా నచ్చ చెప్పడం జరిగింది.కసును పూర్తి స్థాయిలో విచారణ చేసి కేసులో ఎటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వదిలి పెట్టే ప్రసక్తి లేదని వారికి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.కీర్తన కుటుంబం కు పోలీసులు సంయమనం పాటించి నచ్చజెప్పి కుటుంబానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాము.మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్..