prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 9:40 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

క్షేత్రస్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యం… కాశినాయన మండలంలో బిజెపి ప్రశిక్షణ.

ప్రజావాణిన్యూస్(మార్చి26) కాశినాయన శ్రీ అవధూత కాశినాయన మండలంలో ఈనెల 28,29 తారీకులలో రెండు రోజులపాటు బిజెపి ప్రతి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బిజెపి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు,భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి,బీజేపీ మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి తెలిపాడు.క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల నుండి పోటీ చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ,జిల్లా శాఖ ఆదేశాలతో ఈ ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలను,రైతు సమస్యలను గుర్తించి వాటి యొక్క పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ జనత వారధి కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. తద్వారా ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయుటకు జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వెంటనే స్పందిస్తారన్నారు.పోటీ చేయదలచే బిజెపి కార్యకర్తలకు ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టి వారి ద్వారా ప్రజా మద్దతును భారతీయ జనతా పార్టీ లభించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు స్థాయి నుండి,పంచాయతీ సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పిటిసి, మునిసిపల్ కౌన్సిలర్,కార్పొరేటర్ మొదలగు అన్ని స్థాయిలలో పోటీ చేయుటకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందన్నారు.కాశినాయన మండలంలో ప్రతి శిక్షణ కార్యక్రమం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి గారు,కాశి నాయన మండల అధ్యక్షులు బిజి వేముల నారాయణ రెడ్డి గారు,మండల ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మునీంద్ర యాదవ్,పోలేరు ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.