క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ?.. ఆర్ అండ్ బి అధికారులపై తీవ్ర విమర్శలు వారిపై చర్యలు తీసుకోవాలి: ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్

పోరుమామిళ్ల,జులై 28 ప్రజావాణి వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని పోరుమామిళ్ల–రంగసముద్రం రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని,సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు,క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.కాంక్రీట్ రోడ్డు నిర్మాణంలో సాంకేతిక నిబంధనల ప్రకారం తగిన కాలం పాటు క్యూరింగ్ చేయాల్సి ఉండగా,కొన్ని ప్రాంతాల్లో కేవలం పైపైగా నీరు చల్లి...