క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నతస్థానం -ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.
వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) రాజుపాళెం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎల్లారెడ్డి పేర్కొన్నారు.సోమవారం ఉదయం బద్వేల్ మండల పరిధిలోని రాజుపాళెం ఉన్నత పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతోనే ఏదైనా సాధించవచ్చని,మనిషి మనుగడకు చదువు,సంస్కారం ఎంతో అవసరమని సూచించారు.విద్యార్థులు వేసవి సెలవులలో...