సిద్దిపేట ఏప్రిల్ 20, ప్రజావాణి
కోహెడ మండలం లోని బస్వాపూర్ గ్రామంలో గల ఐకేపి సెంటర్ ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సందర్శించి వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సెంటర్ లో గన్ని బ్యాగ్ లు, తేమ శాతంకొలిచేయంత్రాలు, కంఠాల, పాడి క్లీనర్లు, వేసవి కాలం దృష్టికుండలోతాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్ఫలిన్ షీట్లు అందుబాటులోఉంచుకోవాలని తెలిపారు. తేమశాతం చెక్ చేసి తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ వెరిఫై చేశారు.రైతులతోమాట్లాడారు ధాన్యం లోడ్ చెయ్యడం కోసం లారీలు కొరత ఉందని తెలపగా ట్రాన్స్పోర్ట్ కాంటాక్టర్ లతో మాట్లాడి సరిపడినన్ని లారీలు అందుబాటులో ఉంటే విధంగా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు..