prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 9:28 am Digital Edition : RAJASHEKARREDDY

కోహెడ మండలంలోనీ ఆయా గ్రామాలలో మన ఊరు -మన పోలీస్ కార్యక్రమం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం పోలీస్ అధికారుల పిలుపు

కోహెడ మండలంలోనీ ఆయా గ్రామాలలో మన ఊరు -మన పోలీస్ కార్యక్రమం

గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం

పోలీస్ అధికారుల పిలుపు

బెజ్జంకి-కోహెడ, ఏప్రిల్ 9(ప్రజావాణి )

నేరాల నివారణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని సిద్దిపేట జిల్లా కోహెడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీపీఓ అధికారులు గ్రామాలను సందర్శించి, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను మరింత మెరుగుపరచవచ్చని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.అదేవిధంగా, నిరుద్యోగ యువత కోసం సిద్దిపేటలో నిర్వహించనున్న పోలీస్ ఉద్యోగమిత్ర మెగా జాబ్ మేళా గురించి వివరించారు. చదువుకున్న యువతీ యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చేపట్టిన “మన ఊరు – మన పోలీస్” కార్యక్రమం ఉద్దేశాలను కూడా ఈ సమావేశంలో వివరించారు.