prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:32 am Digital Edition : PRAJA VANI

కోదాడలో సంపూర్ణ విద్యాసంస్థల బంద్

కోదాడలో సంపూర్ణ విద్యాసంస్థల బంద్.. విద్యార్థి సంఘాలకు బీఆర్ఎస్వీ సంఘీభావం.. కోదాడ, జూలై 10/ ప్రజావాణి
:తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల బంద్ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ సూచనల మేరకు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం కోదాడ నియోజకవర్గ, పట్టణ బీఆర్ఎస్వీ కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ , పీవైఎల్, ఏఐవైఎఫ్, విద్యార్థి సంఘాలకు సంఘీభావం ప్రకటించారు.అనంతరం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు బొర్రా వంశీ నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేసి నిరుపేద విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలలు, కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ బంద్ పిలుపు మేరకు పట్టణంలో విద్యాసంస్థల బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించారు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి బీఆర్ఎస్వీ నేతలు పలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న సంస్థలను బలవంతంగా మూయించి బంద్‌ను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పట్టణ ఉపాధ్యక్షులు ఆసిఫ్, కార్యదర్శి నవీన్, నాయకులు వితేష్, నసీర్, రాంబాబు, బుజ్జి, వంశీ, సాయి, తరుణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.