కోటేశ్వర స్వామి ఆలయంలో విస్తృత తనిఖీలు

ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, వెల్గాటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుధవారం శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు....