prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 2:18 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కోటిలింగాలలో భక్తుల సౌకర్యాల కొరకు సమావేశం

మహా శివరాత్రి కి కోటిలింగాలలో ముందస్తు ఏర్పాట్లు

గోదావరికి వచ్చే భక్తుల సౌకర్యాల కొరకు సమావేశం

ఆలయ కమిటీ చైర్మన్ పుదారి రమేష్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ ఫిబ్రవరి 09 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న మహాశివరాత్రి పురస్కరించుకొని ముందస్తుగా అన్ని శాఖల అధికారులతో కలిసి ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్, శానిటైజర్, పోలీస్ శాఖ, పార్కింగ్, చలువ పందిర్లు, భక్తులకు కావలిసిన త్రాగు నీరు, మజ్జిగ పాకెట్స్, దుస్తువులు మార్చుకునే గదులు, గజ ఈతగాళ్లు, మొదలైనవి ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ పుదారి రమేష్ స్థానిక అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వెల్గటూర్ తహసీల్దార్ ఆర్ శేఖర్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, ఈ ఓ కాంత రెడ్డి, ఏ ఎస్ ఐ శ్రీనివాస్, ఆర్ ఐ రాంరెడ్డి, స్థానిక సర్పంచ్ కోటయ్య, ఉపసర్పంచ్ అడ్డగట్ల తిరుపతి, ధర్మకర్తలు రాపాక కోటయ్య, బుద్దె రవి, గుమ్ముల వెంకటేష్, గోనె రాజిరెడ్డి, మెరుగు శ్రీనివాస్, అర్చకులు నాగరాజు శర్మ, సంజీవ్ శర్మ, క్లార్క్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.