కోటగిరి ఎస్.సి కాలనీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు.

కోటగిరి ఎస్.సి కాలనీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు. కోటగిరి:-మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం కోడ్ 155 ఎస్.సి కాలనీలో తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వ హించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు బి.గంగమణి,ఏఎన్ఎం మంజుల మాట్లాడుతూ.పుట్టిన 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,ఆ తర్వాత పౌష్టికాహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని తల్లులు,గర్భిణీలు,బాలింతలకు ఆమె సూచించారు.పిల్ల ల్లో పోషకాహార లోపం రాకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తా మని ఆమె అన్నారు....