కొర్రెముల్లలో ఓటరు నమోదు కార్యక్రమం
పోచారం, జూలై 23: ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ కార్యక్రమంలో భాగంగా కొర్రెముల్ల గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వినోద్ నాగార్జున, యూత్ కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి వంశీ, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు అన్నపూర్ణ, ప్రవీణ్, సత్యనారాయణ ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించి, కొత్త ఓటర్ల నమోదుతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులను నమోదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని...