పోచారం, జూలై 23: ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ కార్యక్రమంలో భాగంగా కొర్రెముల్ల గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వినోద్ నాగార్జున, యూత్ కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి వంశీ, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఓలు అన్నపూర్ణ, ప్రవీణ్, సత్యనారాయణ ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించి, కొత్త ఓటర్ల నమోదుతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులను నమోదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి సమర్పించాలని, ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ప్రజలు సహకరించాలని నాయకులు, బీఎల్‌ఓలు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.