కొర్రెములలో సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు….. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : సీఐ కనకయ్య గౌడ్

ఘట్‌కేసర్, జూలై 16 : రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొర్రెముల గ్రామంలో గురువారం సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్‌పై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక యువత సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు...