కొర్రెములలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన వినోద్ కుమార్

ఘట్‌కేసర్ మండలంలోని పోచారం డివిజన్ పరిధి కొర్రెముల గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా విలువైన మంచినీరు వృథా అవుతుండగా, స్థానిక ప్రజలు ఈ సమస్యను ఘట్‌కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టి లీకేజీ సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే...