prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 9:53 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

కొర్రెములలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన వినోద్ కుమార్

ఘట్‌కేసర్ మండలంలోని పోచారం డివిజన్ పరిధి కొర్రెముల గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా విలువైన మంచినీరు వృథా అవుతుండగా, స్థానిక ప్రజలు ఈ సమస్యను ఘట్‌కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టి లీకేజీ సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కె. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజా సేవే తమ ధ్యేయమని అన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కారం చూపించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోచారం కాంగ్రెస్ నాయకుడు ఎర్ర రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు వంశీ యాదవ్, శ్రవణ్ యాదవ్ పాల్గొన్నారు.