కొర్రపాటి పల్లె గ్రామానికి చెందిన సూద్దామాళ్ల హర్షవర్ధన్ రెడ్డి,,పుష్పగిరి పెన్నా నదిలో మృత
వైయస్సార్ జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)పోరుమామిళ్ల మండలం దుగ్గాయపల్లె–కొర్రపాటి పల్లె గ్రామానికి చెందిన సూద్దామాళ్ల నారాయణ రెడ్డి గారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి నిన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి దేవస్థానం సమీపంలో నీటిలో ఈత కొడుతూ సుడిగుండంలో చిక్కుకుని దురదృష్టవశాత్తు మరణించడం తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈరోజు ఆయన మృతదేహాన్ని స్వగృహానికి తీసుకురాగా, విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు అక్కడికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా...