వైయస్సార్ జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)పోరుమామిళ్ల మండలం దుగ్గాయపల్లె–కొర్రపాటి పల్లె గ్రామానికి చెందిన సూద్దామాళ్ల నారాయణ రెడ్డి గారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి నిన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి దేవస్థానం సమీపంలో నీటిలో ఈత కొడుతూ సుడిగుండంలో చిక్కుకుని దురదృష్టవశాత్తు మరణించడం తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈరోజు ఆయన మృతదేహాన్ని స్వగృహానికి తీసుకురాగా, విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు అక్కడికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ,ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే హర్షవర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ విషాద సంఘటన గ్రామస్తులందరినీ తీవ్ర కలవరానికి గురిచేసింది. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, జిల్లా, మాజీ సర్పంచ్ రంగసముద్రం చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మండల పార్టీ సీనియర్ నాయకులు మరియు రాళ్లపల్లి నరసింహులు , చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, షేక్ మస్తాన్, కృష్ణారెడ్డి, మాల కొండయ్య, మధుసూదన్ రెడ్డి, హుస్సేన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు