కొప్పలకొండలో ‘కార్పొరేట్’ మట్టి దోపిడీ: నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ యంత్రాంగం!

అనంతపురం జిల్లా జూన్ 26 ప్రజావాణి గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామం వేదికగా ప్రభుత్వ భూములు,సహజ వనరుల కొల్లగొట్టే పర్వం యథేచ్ఛగా సాగుతోంది.ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం,కొందరు స్థానిక అక్రమార్కులతో చేతులు కలిపి పగలు,రాత్రి తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తోంది. జేసీబీలు,పొక్లెయిన్లతో కొండలను,గుట్టలను తవ్వేస్తూ,ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం "నిమ్మకు నీరెత్తినట్లు" వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పచ్చని కొండలను గుల్ల చేస్తున్న మాఫియా కార్పొరేట్ హాస్పిటల్ ముసుగులో సాగుతున్న ఈ...