కొప్పలకొండలో అడ్డగోలుగా మట్టి దోపిడీ: అధికారుల అండతోనే కార్పొరేట్ సంస్థల హల్చల్?

అనంతపురం జిల్లా జూలై 06 ప్రజావాణి గార్లదిన్నె మండలం కొప్పలకొండ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 568 అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ రాత్రిపగలు తేడా లేకుండా జేసీబీలు,ట్రాక్టర్లతో కొండలను,భూములను తవ్వేస్తూ మట్టిని తరలిస్తోంది.స్థానిక రెవెన్యూ శాఖకు చెందిన ఒక వీఆర్వో  ప్రత్యక్ష పర్యవేక్షణ,అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ముడుపుల పర్వంపై గ్రామస్థుల గుసగుసలు సాధారణ ప్రజలు ఇళ్ల నిర్మాణానికి లేదా పొలాల అవసరాలకు ట్రాక్టర్ మట్టి...