prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 8:43 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కొత్తపేటలో రేపు సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

కొత్తపేటలో రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి పిలుపు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, ఏప్రిల్ 13 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు (మంగళవారం) ఉదయం ఘనంగా జరగనుంది. గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది, దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న, ఈ వేడుకకు మండలస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని సర్పంచ్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ….. మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువకులు, అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.