prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 12:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కొట్టాలపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ పోతురాజు శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం,,

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) బద్వేల్ నియోజకవర్గం శ్రీ అవధూత కాశినాయన మండలము  కొట్టాలపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ పోతురాజు శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఈ రోజు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర మహోత్సవానికి కొట్టాలపల్లె గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు,బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు,అలాగే నియోజకవర్గానికి చెందిన YSRCP ముఖ్య నాయకులు తదితరులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగినది. ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ పోతురాజు వారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమైనది.