prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 8:22 am Digital Edition : PRAJA VANI

కొండపాక గ్రామంలోఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమం ప్రారంభం<br>

కొండపాక గ్రామంలోఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమం ప్రారంభం

* గ్రామ సర్పంచ్ వీరస్వామి

* బిసిఐ క్లస్టర్ కోఆర్డినేటర్ మహేందర్

జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)

వీణవంక మండలం కొండపాక(గ్రామం లో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ వారి బిసిఐ ప్రాజెక్ట్  ఎస్ బి ఐ ఆర్ ఎస్ ఈ టి ఐవారు సంయుక్తంగా  మగ్గం వర్క్స్ ఉచిత నెలరోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిఐ క్లస్టర్ కోఆర్డినేటర్ మహేందర్  మాట్లాడుతూ రైతు కుటుంబ సభ్యుల జీవనోపాదులు పెంపొందించడంలో భాగంగా వివిధ స్కిల్ డెవలప్మెంట్  సెంటర్ల భాగస్యామ్యం తో వివిధ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగానే  గ్రామంలో బేస్ లైన్ సర్వే నిర్వహించి అక్కడి మహిళల ఆసక్తులకు అనుగుణంగా మగ్గం వర్క్స్ కి సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని వారి గ్రామంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని శిక్షణలో పాల్గొనే ప్రతి మహిళ  తమ నైపుణ్యాలను పెంపొందించుకొని వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వారితో పాటు ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రతి విషయంలో నిర్ణయాధికారం పెంపొందించుకునే దిశగా అడుగులు వేయాలని తెలపడం జరిగిందిగ్రామ సర్పంచ్ వీరస్వామి మాట్లాడుతూ బీసీఐ వారు ఎస్ బి ఐ ఆర్ ఎస్ ఈ టి ఐవారు కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని కొండపాక గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలపడం జరిగిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీఐ జెండర్ ఎక్స్పర్ట్ సౌజన్య  మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రగతిని సాధిస్తూ మహిళా సాధికారతను సాధించాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలియజేయడం జరిగిందిఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్ బి ఐ ఆర్ ఎస్ ఈ టి ఐప్రాజెక్ట్ డైరెక్టర్ రవి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు యువత ఉపాధి పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు అందిస్తున్నామని మహిళల కోసం కుట్టు శిక్షణ జూట్ బాగ్స్ తయారీ అగర్వత్తుల తయారీ కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలు రూపొందించామని యువతకు సెల్ ఫోన్ రిపేర్ రిఫ్రిజిరేటర్ రిపేర్ వంటి కార్యక్రమాలు రూపొందించామని శిక్షణ అనంతరం వారు స్వయంగా బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియచేస్తామని ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కుమార్ పాలక వర్గం పంచాయతీ సెక్రెటరీ తిరుపతి స్కూల్ హెడ్మాస్టర్ రాజయ్యబీసీఐ అసిస్టెంట్ మేనేజర్ మల్లేష్ బీసీఐ స్టాఫ్ సౌజన్య మోహన్ అనిల్ కుమార్ ట్రయినర్ రజిత ఫాకల్టీ  విజయ్ కుమార్ 30 మంది మగ్గం వర్క్ లబ్ధిదారులు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.