prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 3:36 am Digital Edition : RAJASHEKARREDDY

కొండచిలువ కలకలం

భావుల దగ్గరికి వెళ్లే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బెజ్జంకి, మార్చి 27(ప్రజావాణి )

 

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పాత చెక్ డ్యామ్ వద్ద రైతు తులిశాల శేఖర్ రోజు మాదిరిగానే తమ వ్యవసాయ పనుల నిమిత్తం తమ పంటపొలాల (బావి )దగ్గరకి వెళ్తున్న క్రమంలో అతనికి బారికొండ చిలువ కంటపడింది.ఈ సందర్బంగా రైతు మాట్లాడుతూ ఇంత పెద్ద భారీ కొండచిలువ ఇదే చూడడం మొదటిసారి అని తెలుపుతూ,చెక్ డ్యామ్ వైపు బావుల దగ్గరకి వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు ముందస్తూ సమాచారం అందించారు.