కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కడప నగరంలోని వైయస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యాలయంలో సోమవారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ కేసుల కోసం జగన్ భయపడే వాడైతే నాడు సోనియా గాంధీతో పోరాటం చేసేవారా?చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అద్దెమైకులా మారి చిలక పలుకులు పలుకుతారా?వై.ఎస్. జగన్ కలుపు మొక్క కాదు.రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క.వై.ఎస్ కుటుంబంతో మీకు మేలు జరగలేదని మీ అన్న నారాయణరెడ్డి తో చెప్పించగలరా?ఏపిసిసి చీఫ్ షర్మిలమ్మ.బిజెపి ఎమ్మెల్యే ఆదికి వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం సవాల్.కేసుల నుంచి రక్షణ కోసం వై.ఎస్. జగన్ బానిసలా బ్రతికే వాడైతే.ప్రధాని నరేంద్ర మోడీని పాదేయ పడి ఒక కేసు నైనా తొలగించుకున్నారా నాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పోరాటం చేసేవారా16 నెలలు జైల్లో ఉన్నా అదరక.బెదరక తిరిగి ముఖ్యమంత్రి కాగలిగే వారా దమ్ముంటే సమాధానం చెప్పాలని ఏపీసిసి చీఫ్ షర్మిలమ్మకు వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి సవాల్ విసిరారు. కడప నగరంలోని వైయస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యాలయంలో సోమవారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ షర్మిలమ్మ.మీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి డా||వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారిని ఓదార్చేందుకు వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్ర చేపడితే సోనియా గాంధీ ఓదార్పు యాత్రను అడ్డుకొని తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం.మీ తండ్రి డా||వైయస్సార్ పేరును సిబిఐ చార్జిషీట్ లో చేర్చిన విషయం మరిచి మళ్లీ తగుదు నమ్మా అంటూ వైయస్సార్ ఆశయాలు, వారసత్వం, మహానేత సిద్ధాంతాలు మంట గలిపి నందుకు విలువలకు తూట్లు పొడిచినందుకు వై.ఎస్. జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ కూటమి ప్రభుత్వానికి అద్దెమైకులా మారిన షర్మిలమ్మ చిలక పలుకులు మొగుణ్ణి కొట్టి మోసాలెక్కినట్టుందని, ఇది రాజకీయాల్లో ఉన్నత విలువలకు తిలోధకాలు ఇవ్వడమేనని ఆయన ఎద్దేవా చేశారు.మీ తోడబుట్టిన అన్న వై.ఎస్ జగన్ ను జైలుకు పంపినా.మీ తండ్రి వైయస్సార్ పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చినా కాంగ్రెస్ తో మీరు సిగ్గు లేకుండా అంటకాగవచ్చు గానీ దమ్మున్న నేత జగన్ కాంగ్రెస్ తో చట్టా పట్టా లేసుకొని మద్దతు తెలపాలా?అంటూ ఆయన నిలదీశారు. ఏపీ సి సి చీఫ్ గా ఉండి ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ సీపీకి, వైఎస్. జగన్ కు మద్దతునివ్వాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ మీరు చేసిన పనికి వైయస్సార్ ఆత్మ ఘోషిస్తోంది.క్షోభిస్తోందని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మసలుకోవాలని షర్మిలమ్మకు రెడ్యం హితవు పలికారు. వైయస్సార్ సిపి తో పాటు కూటమి ప్రభుత్వం కూడా బిజెపి పెట్టిన బిల్లుకు మద్దతునిస్తే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం వై.ఎస్. జగన్ ను మాత్రమే విమర్శించడం కూటమితో షర్మిలమ్మ స్నేహాన్ని.కుమ్ముక్కును తెలియజేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా షర్మిలమ్మ జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుందని దాంతో కూటమి ప్రభుత్వ దత్తపుత్రికగా పేరు తెచ్చుకుందని ఆయన విరుచుకపడ్డారు.వై.ఎస్.జగన్,డా||వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి లు వారికి రాజకీయ భిక్ష పెడితే, ఆ విషయాన్ని మరచి జమ్మలమడుగు బిజెపి శాసనసభ్యుడు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వై.ఎస్. జగన్ ను కలుపు మొక్క అనడం వారి నీచ రాజకీయానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్ రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క అని తెలుసుకుని మసలుకోవాలని ఆయన హితవు పలికారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ కుటుంబం వై.ఎస్ కుటుంబంతో లబ్ధి పొందలేదని మీ సొంత అన్న మాజీ ఎమ్మెల్సీ చలిపిరాళ్ల నారాయణరెడ్డి తో చెప్పించాలని రెడ్యం సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో మండల పరిషత్ సంఘం జిల్లా అధ్యక్షుడు,వైయస్సార్ సిపి వీరపనాయనిపల్లె మండల అధ్యక్షుడు కల్లూరు రఘునాథరెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి పీతాంబరి మహేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల నేత,ఊటుకూరు ఎంపీటీసీ ఎద్దుల వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత మున్నెల్లి సుబ్బరాయుడులు పాల్గొన్నారు