కేల్ మహేంద్ర కాలనీలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
ఘట్‌కేసర్, జూలై 5: ఘట్‌కేసర్ మండల పరిధిలోని కేల్ మహేంద్ర కాలనీలో ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నిత్యార్చన, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన, ఆశీర్వచన కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు...