prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 7:39 am Digital Edition : PRAJA VANI

కేటీఆర్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా<br>

మన సమగ్ర ప్రజావాణి జూలై 24(జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా జోగిపేటలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, చాపల వెంకటేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణకు మెరుగైన సేవలు అందించే శక్తి, సామర్థ్యం కల్వకుంట్ల తారక రామారావుకు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీర్ల శంకర్, పుర్ర సంతోష్, ఆకుల సంతోష్, ఎండీ గోరే, పరిపూర్ణం, పోలీస్ శంకర్రావు, రఫీక్, నారాయణ, ముస్లాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.