prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:06 pm Digital Edition : PRAJA VANI

కేటీఆర్ జన్మదినం సందర్భంగా పోతంగల్‌లో సేవా కార్యక్రమాలు

కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ – ఆడపిల్లకు తాతయ్య కానుకగా రూ.5 వేల ప్రకటన .

సమాజంలో ఆడపిల్లలను ప్రోత్సహించడమే తన లక్ష్యం.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఏం.ఎ.హకీమ్.

తెలంగాణ భవిష్యత్తు మార్గదర్శి కేటీఆర్.

బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సూదం నవీన్.

కరువు,నీట్ లీక్ నేపథ్యంలో సాదాసీదాగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

బిఆర్ఎస్  మండల నాయకులు హారీఫ్.

కేటీఆర్ పిలుపుతో పోతంగల్లో సేవా కార్యక్రమాలు.

కోటగిరి/ప్రజావాణి:-కేటీఆర్ జన్మదిన సందర్భంగా పేద కుటుంబంలో మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే వారికి రూ.5000 నగదును తాతయ్య కానుకగా ప్రకటిస్తున్నట్లు పోతంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఏ హకీమ్ మండల ప్రజలకు శుభవార్తను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మార్గదర్శి కల్వకుంట్ల తారక రామారావు అని బీఆర్ఎస్ పార్టీ పోతంగల్ మండల అధ్యక్షులు సూదం నవీన్ అన్నారు. రాష్ట్రంలో కరువు కేంద్రంలో నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను సాదాసీదాగా నిర్వహించామని బీఆర్ఎస్ పార్టీ పోతంగల్ మండల సీనియర్ నాయకులు హారీఫ్ అన్నారు.శుక్రవారం పోతంగల్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా మండల పరిధిలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు,స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్,పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.తదనంతరం పోతంగల్ గ్రామానికి చెందిన కన్నం హన్మండ్లు కంటి ఆపరేషన్ చేయించుకుని నిస్సహాయస్థితిలో ఉంటే ఆయనకు ఎం.ఏ హాకీమ్ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎం.ఏ హాకీమ్,సూదం నవీన్, హారిఫ్ మాట్లాడుతూ.రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు,దేశంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దృష్ట్యా జన్మదిన వేడుకలు వద్దన్న కేటీఆర్ పిలుపుమేరకు పోతంగల్ మండల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.ముందుగా కేక్ కటింగ్,మహా అన్నదాన కార్యక్రమాలు అట్టహాసంగా చేయాలని అనుకున్న కేటీఆర్ ఆదేశాలతో వారి జన్మదిన వేడుకలను సాదాసీదాగా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు,రైతులు,యువత భవిష్యత్తు లక్ష్యంగా పనిచేస్తున్న నిరాడంబర నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు.ఆయన అడుగు జాడల్లోనే తామందరం నడుస్తామని ఉద్ఘాటించారు.నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో చేసిన లాఠీచార్జీలను వారు తీవ్రంగా ఖండించారు.నీట్ బాధిత విద్యార్థులకు పోతంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నామని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని.ఈ ఘటనపై దేశస్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కోమటి గంగాధర్,దోమలెడ్గి ఉప సర్పంచ్ బీం రావు,హనుమంతు,సురేష్,పట్నం సాయిలు,బిక్యా నాయక్,రేణీ రాములు, ఉమర్ ఖాన్,ఆఫ్రాజ్,సూదం సాయిలు, ఇమ్రాన్,జలాల్,అవేస్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.