పిడిఎస్యూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్
చెన్నూరు,జూలై24, ప్రజావాణి:
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యూ ఆధ్వర్యంలో చెన్నూర్‌లో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీల వల్ల 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థి, యువతపై పోలీసులు లాఠీఛార్జ్, వాటర్ కెనాన్లతో దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమన్నారు. దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని, తక్షణమే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.