కేంద్రీయ విద్యాలయం ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో 11వ తరగతి ప్రవేశాలకు అవకాశం. సైన్స్, కామర్స్ విభాగాల్లో ఖాళీ సీట్లు – త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
ఘట్‌కేసర్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కేంద్రీయ విద్యాలయం ఎన్‌ఎఫ్‌సీ నగర్ లో 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతి కొత్త ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. సైన్స్, కామర్స్ విభాగాల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రవేశాల కోసం పాఠశాల ప్రిన్సిపాల్‌ను లేదా కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఆసక్తి గల...