కెనాల్ నీరు బంద్ చేస్తే పంటలు ఎండిపోతాయి – రేకొండ రైతుల ఆవేదన
మరో 15 రోజులు నీరు విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నపం ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామ రైతులు సాగునీటి కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామ శివారులోని కెనాల్ నీటిపై ఆధారపడి సుమారు 100 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే ప్రస్తుతం పంట కీలక దశలో ఉండగా నీటి సరఫరా నిలిపివేసే అవకాశం ఉందన్న వార్తలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ (యాసంగి) సీజన్ ప్రారంభంలో కెనాల్ కట్టలు తెగిపోవడం మరియు...