prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 9:31 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ గారి సేవలు మరువలేనివి     బదిలీపై వెళుతున్న హుస్సేన్ మేనేజర్ గారికి వాకర్స్ మిత్రుల ఘన వీడ్కోలు సన్మానం 

ప్రజావాణి న్యూస్ (మే 10) పొదిలి కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ సేవలు మరువలేనివి బదిలీపై వెళుతున్న హుస్సేన్ మేనేజర్ గారికి వాకర్స్ మిత్రుల ఘన వీడ్కోలు సన్మానం  పొదిలి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నవ్వులు పువ్వులు వాకర్స్ సంఘం అధ్యక్షులు షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది  హుస్సేన్ గారు కెనరా బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ బ్యాంకు కస్టమర్లకు సరైన సహకారం అందిస్తూ, వాకర్స్ సంఘములో చేరి మిత్రులకు సలహాలు ఇస్తూ, మిత్రుల కోరికపై మానవతా సంస్థలో సభ్యులుగా చేరి బీదలకు తోడ్పడ్డారని అధ్యక్షులుషేక్ మదార్ వలి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ మిత్రులు భాషా మొహిద్దిన్, మదార్ వలి, గోవిందయ్య, బుట్టో జిలాని, మీరావలి, ఇడ్లీ జిలాని, తోట నారాయణ,సుబ్రహ్మణ్యం, మస్తాన్ భాష, ఖాదర్ బాషా, గౌస్, అల్లూరయ్య తదితర మిత్రులు పాల్గొన్నారు సన్మాన గ్రహీత హుస్సేన్ మాట్లాడుతూ నేను ఇక్కడ గడిపిన మూడు సంవత్సరాలు ఎంతో ఆనందకరముగా గడిచినవని,ఈ వాకర్స్ మిత్రులందరు నన్ను వారి తోబుట్టు లాగా చూసుకున్నారని, వీరందరినీ నేను జీవితాంతము గుర్తుంచుకుంటానని అందరికీ అభినందనలు తెలిపారు