prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:59 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల సంబరాలు

•కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల సంబరాలు

 

•ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ అచ్చి నాగరాజు

 

పటాన్‌చెరు, ఆగస్టు 7 (ప్రజావాణి): పటాన్‌చెరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల పండుగను శుక్రవారం సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు స్కూల్ డైరెక్టర్ అచ్చి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా పాల్గొని ఆకట్టుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ అచ్చి నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు,పాల్గొన్నారు.