కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలి
మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి
అనంతపురం బ్యూరో జూలై 24 నేటి శుభోదయ
అనంతపురం నగరంలోని
డా. బి.ఆర్. అంబేద్కర్ మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్పనర్ పంపిణీ చేయడం చేశారు. అలాగే తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడటంతో పాఠశాలల్లో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బల్లా పల్లవి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలన్నీ నెరవేర్చుతున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారని ప్రస్తుత ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి భావిభారత
పౌరులని కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని విద్యార్థులకు చైర్ పర్సన్ బల్లా పల్లవి సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నారాయణస్వామి యాదవ్,హెడ్ మాస్టర్, టీచర్లు విద్యార్థి ,విద్యార్థినీలు పాల్గొన్నారు.
