prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:03 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కూటమి పతనం అరంభమైంది .వెన్నుపోటుకు రెండేళ్లు సక్సెస్ తో ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేలిపొయింది

వైఎస్ఆర్ కడప (ప్రజావాణి జూన్ 13) జిల్లాలోను కడప,కమలాపురం,పులివెందుల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,మైదుకూరు,బద్వేలు ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు.తిరుపతిలో మీరు నడిపిన విజయోత్సవ సభలో మీరు చెప్పిన అపద్దాలు.మోసాలు చూసి అది మీ అంతిమ వీడ్కోలు సభను తలపించింది.ఇక మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపడం ఖాయం ఈ సారి కూటమి గా వచ్చిన మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు.సూపర్‌ సిక్స్‌… సూపర్‌ సెవెన్‌ అంటూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేశారు.మొత్తం 143 హామీలు త‌న మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా,ప్ర‌తి ఇంటికీ వెళ్లి బాండ్లు రాసి మ‌రి ఇచ్చారు.ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ?అని సమాధానం చెప్పకుండా దొంగతిరుగుడు మాటలతో కాలం వెళ్లదీస్తున్నావు.ఈ కూటమి పాలనలో రైతులను మోసం చేశారు,మహిళలను మోసం చేశారు,యువతను మోసం చేశారు,విద్యార్థిని మోసం చేశారు.చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు.ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏ మాత్రం పొంతనే లేదు.ప్రతి క్షణం మోసం,ప్రతి పనిలో దగా,అంతా స్కాంల మ‌య‌మే!ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు.పచ్చి అబద్ధాల ప్రచారం !సంక్షేమం కాదు.రాష్ట్ర ప్ర‌జ‌లు చూసింది మోసం!ప్రజాపాలన కాదు.రాజకీయ కక్షసాధింపులు,వివక్ష,అరాచకాలు,రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక పాలన!‘ఇది మంచి ప్రభుత్వమని’’చెప్పుకునే ఈ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి.మహిళలకు,చిన్నారులకు రక్షణే లేదు.పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు.శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు.విద్యా, వైద్య రంగం దెబ్బతిన్నాయి! వ్యవసాయం సంక్షోభంలో ఉంది,ఏ పంటకూ గిట్టుబాటు ధరలేద !ఎరువులు అందజేయలేకున్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు.కానీ పేరుకు మెగా డీఎస్సీ అంటూ,నిర్వహణలో అక్రమాలు,అవకతవకలు,స్కామ్‌ల‌తో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.ప్రతి హామీని గుర్తుంచుకున్నారు.ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు.ప్రజల ఆవేదనకు,వ్యతిరేకతకు అద్దంపట్టాయి.వారి ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి.కుప్పం నుండి.కురుపాం వరకు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో.”వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమాలను పరిశీలిస్తే.కూటమికి కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోంది.అన్నివర్గాల అండతో,ప్రజాబలంతో, దేవుడి ద‌య‌తో ఈ దుర్మార్గపు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలపడం ఖాయం.ఈ పోరాటంలో పాల్గొన్న ప్ర‌జ‌ల‌కు.వారికి తోడుగా నిలబడిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, నా హృదయపూర్వక అభినందనలు.