కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం ఉద్యమించాలి : వ్య.కా.స రాష్ట్ర కోశాధికారి కె. ఆంజనేయులు వర్క్ షాప్ లో కార్యాచరణ ప్రణాళిక

కడప అర్బన్ జూలై 11 ప్రజావాణి కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం యువత ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు పిలుపునిచ్చారు.శనివారం ప్రెస్ క్లబ్ లో కెవిపిఎస్,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే అంశంపై జిల్లా స్థాయి వర్క్ షాప్ వ్య.కా.స జిల్లా కార్యదర్శి అన్వేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కులాంతర వివాహల బారిన పడిన యువతను తుద ముట్టిస్తున్న ఘటనలు అనేకం చూస్తూ ఉన్నామని...