కుమ్మరిపల్లె ఆదర్శ పాఠశాల నూతన సారథిగా సందీప్ రాజు బాధ్యతల స్వీకరణ

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లెలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (టీజీఎంఎస్) ప్రిన్సిపల్‌గా కే సందీప్ రాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా సందీప్ రాజు మాట్లాడుతూ.... విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే తమ ప్రథమ లక్ష్యమని, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతన ప్రిన్సిపల్‌కు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.